ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత

By Sekhar Reddy Vasa

ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-07-29
  • Genre: Bibles

Description

ప్రియపాఠకులారా! ఏడు అను సంఖ్యపైన వ్రాసిన ఈ పుస్తకమునకు మూలాధారము పవిత్ర గ్రంథము అని మరల చెప్పనవసరత లేదు. మొట్టమొదట, దేవుడు ఈ సృష్టిని ఏడు దినములలో సృష్టించాడు. ఈ విషయమును గూర్చి మనము బైబిలు గ్రంథమను వేదములో చదువగలము. ఈ పుస్తకమునకు గ్రంథకర్తనైన నేను ఈ ఏడు రోజులను ఒక మూలముగా చేసుకొని పవిత్రాత్మ ప్రేరణతో ఈ పుస్తకమును వ్రాసాను. ఈ పుస్తకము నందు నేను దేవునియొక్క ప్రణాళిక మరియు ఉద్దేశ్యమును ఏడు సంఖ్యగా మార్చుటకు చాలా శ్రమించవలసి వచ్చింది. ఇందుకోసము అనేక దినములు పరిశోధించవలసి వచ్చింది. నేను దేవుని ఆత్మ సహాయము తప్ప మరే గ్రంథకర్తల సహాయము తీసుకొనలేదు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవునియొక్క రహస్యములను బహిర్గతము చేయు సంఖ్య ఏడు. ఈ పుస్తకమును వ్రాయుటకు ముందు సుమారుగా ఆరు నెలల కాలము పవిత్ర గ్రంథమును నేను పఠించి ప్రతి విభాగమును ఏడు సంఖ్యగా పూర్తి చేయుట జరిగింది. ఈ పఠన కాలములో, నేను 2, 3, 4, 5, 6, 10, 12, 40 వ్రాసాను. ఈ పుస్తకమును కూడ చదివి మీ యొక్క సలహాలను ఇవ్వండి. క్రీస్తు ప్రభువు యొక్క కృప అందరికి తోడైయుండునుగాక! ఆమేన్‌.