ఏలీయా

By Sekhar Reddy Vasa

ఏలీయా - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-01-15
  • Genre: Religion & Spirituality

Description

ప్రియపాఠకులారా! ఇది చాలా చాలా చిన్న పుస్తకము. కాని దీనిలో ఉన్నది ఏలీయాలోని శక్తి ఏలీయాను గూర్చిన భవిష్యత్తు. అన్ని కాలాల వారికి ఇంకా భవిష్యత్తుగానే ఉన్న వ్యక్తి ఏలీయా. రాజులకాలమునకు ముందు వారికి సుడి గాలిలో ఆరోహణమయ్యే వ్యక్తిగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు. ఇది రాజుల కాలములో జరిగింది. నూతన నిబంధనకు ముందు క్రీస్తుప్రభువు మార్గమును సరాళము చేసి ఇశ్రాయేలీయదేశము నాశనముకాకుండుటకు వచ్చిన శబ్దముగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు. ఇది నూతనని బంధన ప్రారంభకాలములో జరిగింది. ఇప్పుడు మనకు యుగాంతమునకు ముందు క్రీస్తుప్రభువు రాకడకు ముందు ఆయన మార్గమును సరాళముచేయువానిగా తనకు తోడుగా హనోకు తోకలిసి వచ్చుట జరుగును. ఇదిజరగవలసినది. అంటే భవిష్యత్తు గూర్చిన ప్రవచనములు. యుగాంతమునకు ముందు ప్రపంచనాశనము జరగకుండా చేయుటకు వచ్చి నరుల హృదయమును దేవుని వైపు త్రిప్పుటచేస్తాడు. ఇలాచేసినను వారి మరణానంతరము జనులు తిరిగి సాతాను విశ్వరూపమైన క్రూరమృగమునకు దాసోహులై యుగాంతమునకు కారకులు అగుచున్నారు. ఇలాస్వభావమున ఒకమనుష్యుడైన ఏలీయా ఇంచుమించు అన్నికాలాలలో తన ఆత్మరూపములోను మరియు భౌతికశరీరములతో ఇద్దరుసాక్షులుగాను నరులమధ్య క్రియజరిగించెను, జరిగించును, జరిగిస్తాడు.....
ఇలాంటి ప్రవక్తను గూర్చి తెలుసుకొనుట మన జీవితములో ఒకగొప్ప అనుభూతి. ఈఅనుభూతి మధురముగా ఉంచుకొనుటకు నీతిపరిశుద్ధతతో దేవునిలో జీవించాలి. లేనియెడలచి వరకు మిగిలేది బూడిద అన్నట్లుగా మన ఆత్మీయ జీవితము పాతాళలోకము అగ్ని గుండములలో చేదు అనుభవమును పొందును.
ఏదిఏమైనప్పటికి, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసిన ప్రవక్తలలో ఏలీయా ఏలీయానే!
ఇట్లు
శేఖర్‌రెడ్డి